Gachibowli Land Dispute: ఫేక్ వీడియోలు ప్రచారం.. ఆ పార్టీ నేతలపై కేసు నమోదు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 06:42 PM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం భూములను తీసుకోవద్దని, అక్కడున్న చెట్లను తొలగించవద్దని హెచ్‌సీయూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం భూములను తీసుకోవద్దని, అక్కడున్న చెట్లను తొలగించవద్దని హెచ్‌సీయూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు కాస్త పెద్దఎత్తున ఘర్షణలకు దారి తీశాయి.
నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ సైతం చేశారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. మరోవైపు విద్యార్థుల నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‍గా మారాయి. అయితే యూనివర్శిటీలో విద్యార్థుల నిరసనలకు సంబంధించి నకిలీ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ దిలీప్, క్రిశాంక్‌పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఎడిట్ చేసిన వీడియోలు వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అందిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు చర్యలు చేపట్టారు.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టి గులాబీ పార్టీ నేతలపై కేసు బుక్ చేశారు. దిలీప్, క్రిశాంక్ ఇద్దరూ హెచ్‌సీయూ అధికారులను సంప్రదించకుండా వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రజల్లో అశాంతిని కలించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా భూముల వివాదంపై ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో పోస్టులు పెట్టారని తెలిపారు. వీరిపై 353 1(b), 353 1(c),353(2), 192, 196(1), 61 (1)(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..
MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..