Hyderabad: ఈ మార్గంలో వెళ్తున్నారా.. అయితే అలర్ట్..
ABN , Publish Date - Jan 01 , 2025 | 02:17 PM
కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన బీఆర్ఎస్ (BRS) శ్రేణులు తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి ఫిలింనగర్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల గుండా గమ్యస్థానాలకు వెళ్తే మంచిది.