Share News

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:14 AM

తెలంగాణ: మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీలో నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు.

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
HYDRA

హైదరాబాద్: మాదాపూర్‌(Madhapur)లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీ (Ayyappa Society)లో నిబంధలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా (HYDRA) అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు హైడ్రా బృందాలు, పోలీసులు అక్రమ నిర్మాణం వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయ్యప్ప సొసైటీలో 684 గ‌జాల‌ స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించారు. జీహెచ్‌ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు ప‌ట్టించుకోకుండా సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు ఐదంత‌స్తుల బిల్డింగ్‌ను ఓ వ్యక్తి కట్టారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.

Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు..


ఈ మేరకు నిన్న(శనివారం) అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అలాగే అయ్యప్ప సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై ఆయన సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వారందరికీ ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నేడు ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమ కట్టడమని హైకోర్టు నిర్ధారించిన తర్వాత కూడా ఉత్తర్వులను ప‌ట్టించుకోకుండా బిల్డింగ్ నిర్మించినట్లు తెలుస్తోంది. కూల్చివేత‌కు సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చినా భవన యజమాని పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూల్చివేతలు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Chicken Price: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Weather Report: ఏపీని వణికిస్తున్న చలిపులి.. పరిస్థితి ఎలా ఉందంటే..

Updated Date - Jan 05 , 2025 | 11:18 AM