Share News

IT Rides: రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:48 AM

హైదరాబాద్: ఇన్‌కంటాక్స్‌ అధికారుల సోదాలు రెండోరోజు బుధవారం హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. నిన్న నిర్మాత దిల్‌ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు.

IT Rides: రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
IT Rides in Hyderabad

హైదరాబాద్: ఇన్‌కంటాక్స్‌ అధికారుల సోదాలు (IT Rides) రెండోరోజు (Second Day) బుధవారం (Wednesday) హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రి (SVC, Maitri), మ్యాంగో మీడియా (Mango Media) సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేస్తున్నారు. నిన్న (మంగళవారం) నిర్మాత దిల్‌ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. అధికారులు ఈరోజు దిల్ రాజును ఎస్‌వీసీ ఆఫీస్‌కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ వార్త కూడా చదవండి..

ప్రపంచానికి మనమే మోడల్‌


కాగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు టార్గెట్‌గా ఇన్‌కంటాక్స్‌ అధికారులు మంగళవారం వరుస సోదాలతో హడలెత్తించారు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 55 ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, ఫిలిం ప్రొడక్షన్‌ సంస్ధల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాల్లో, ఆయన కుమార్తె హన్సిత రెడ్డి, సోదరుడు శిరీష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ సంస్ధకు సంబంధించి మైత్రి నవీన్‌, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అవకతవకలను గుర్తించినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘పుష్ప 2’ భారీ కలెక్షన్లు సాధించిన విషయాన్ని బహిరంగంగా లెక్కలతో సహ నిర్మాతలు చెప్పడంతో ఆ మొత్తానికి సంబంధించి అసలు వాస్తవాలు జీఎస్టీ లెక్కలు, ఆదాయంలో ఈ కలెక్షన్‌ చూపించారా? లేదా అనే విషయాలను ఐటీ అధికారులు పరిశీలించారని సమాచారం.


సింగర్‌ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్ధలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్‌ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఒక బ్యాంకు లాకర్‌ను గుర్తించి ఆ లాకర్‌ దిల్‌రాజు భార్య తేజస్వీని పేరిట ఉండటంతో ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్లి లాకర్‌ తెరిపించారు. ఐటీ వాళ్లు లాకర్‌ తెరిచి చూపించాలని అడిగారు అలాగే చేశామని తేజస్వీని మీడియాతో అన్నారు. ‘పుష్ప2, గేమ్‌ చేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు వందలకోట్ల రూపాయలుగా ప్రచారం జరిగిన నేపధ్యంలో ఐటీ విభాగం ఈ సోదాలను చేపట్టినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

సిఐడి మాజీ చీఫ్ అధికార దుర్వినియోగంపై విచారణ..

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనుల మృతి

బొత్సకు ఆ విషయం కూడా తెలియదా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 22 , 2025 | 08:48 AM

News Hub