Share News

NTR Death Anniversary: ఎన్టీఆర్ వర్ధంతి.. తాతకు నివాళి అర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..

ABN , Publish Date - Jan 18 , 2025 | 07:47 AM

NTR Death Anniversary: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్నారు. తాతకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు.

NTR Death Anniversary: ఎన్టీఆర్ వర్ధంతి.. తాతకు నివాళి అర్పించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..
NTR Death Anniversary

హైదరాబాద్: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఈరోజు (శనివారం) వెళ్లి కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి, నారా కుటుంబ సభ్యులు నివాళులు ఆర్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కుటుంబ సభ్యులు, లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఉదయం 8.30 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ రానున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లో నారా లోకేష్ నివాళులర్పించనున్నారు. ఉదయం 9గంటలకు రసూల్‌పురలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటలకు బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.


ఎన్టీఆర్ ఘాట్‌కు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కాసేపటి క్రితమే చేరుకుని వారి తాతయ్య ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఘాట్‌లో కింద కూర్చుని తాతయ్యను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూసేందుకు ఘాట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి చుట్టూ తిరిగి పూలతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 18 , 2025 | 10:34 AM