Share News

Gaddar Film Awards 2025: గద్దర్ అవార్డ్స్.. నామినేషన్ల స్క్రీనింగ్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Apr 16 , 2025 | 08:20 PM

సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని హరీశ్ పేర్కొన్నారు.

Gaddar Film Awards 2025: గద్దర్ అవార్డ్స్.. నామినేషన్ల స్క్రీనింగ్ ఎప్పుడంటే..

హైదరాబాద్: సినీ నటులకు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ(బుధవారం) సినీనటి జయసుధ ఛైర్మన్‌గా గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సమావేశమైంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జయసుధ అధ్యక్షతన సభ్యులు భేటీ అయ్యారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‍గా తీసుకుని నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జయసుధ తెలిపారు.


తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించిదని, నిష్పక్షపాతంగా నామినేషన్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలనచిత్ర అవార్డులకు ఇంత స్పందన రాలేదని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు.


సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. గద్దరన్న అవార్డులకు అన్ని కేటగిరీలకు కలిపి మెుత్తం 1,248 నామినేషన్లు అందినట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని హరీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ క్యాటగిరీల ఎంట్రీలకు సంబంధించిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరీలో 1,172.. ఫీచర్‌ ఫిలిమ్, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురీ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Updated Date - Apr 16 , 2025 | 08:21 PM