Share News

TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:04 PM

వక్ఫ్‌బోర్డుపై హైకోర్టులో గతేడాది పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా ఇబాదత్‌ఖానాను స్వాధీనం చేసుకోవాలని పిటిషినర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

TG High Court: వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న..
TG High Court

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వక్ఫ్ ‌బోర్డుపై చర్చ జరుగుతున్న వేళ దాని తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్‌ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్‌ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వక్ఫ్ బోర్డు అమలు చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. పేదల పక్షాన వక్ఫ్‌ బోర్డు పనిచేయట్లేదని జస్టిస్ నగేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పవిత్ర ఖురాన్‌లోని పేరాలను జస్టిస్ నగేశ్‌ భీమపాక ఉటంకించారు. పాదరక్షలు విడిచి ఖురాన్‌లోని అంశాలు చదివి వినిపించారు. అలాగే పిటిషనర్లు సైతం ఖురాన్ స్ఫూర్తిని మరిచిపోయారని వ్యాఖ్యానించారు.


వక్ఫ్‌బోర్డుపై హైకోర్టులో గతేడాది పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా ఇబాదత్‌ఖానాను స్వాధీనం చేసుకోవాలని పిటిషినర్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇబాదత్‌ ఖానాను స్వాధీనం చేసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఇబాదత్‌ ఖానా నిర్వహణకు కమిటీ వేయాలని సూచించింది. ఈ నిర్వహణ కమిటీలో ఈక్వల్‌ మెంబర్స్‌కు చోటు కల్పించాలని ఆదేశించింది.


అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్ఫ్ బోర్డు పెడచెవిన పెట్టింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనిపై పిటిషనర్ మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తీరుపై మండిపడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

MP Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. లిక్కర్ స్కామ్ కేసులో..

Weather Updates: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Updated Date - Apr 03 , 2025 | 04:05 PM