Share News

BRS: కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన

ABN , Publish Date - Mar 20 , 2025 | 08:05 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్లనున్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో 10 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారు.

BRS: కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
BRS Working President KTR

హైదరాబాద్: మాజీ మంత్రి (Ex Minister, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజా సమస్యలతో పాటు.. క్యాడర్‌లో జోష్ నింపటమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి సూర్యాపేట (Suryapet)కు వెళ్లనున్నారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో 10 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తల (BRS Activists)తో కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారు. అలాగే ఈనెల 23న కరీంనగర్‌ (karimnagar)లో ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాలకు కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాలకు కేటీఆర్ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు.

Also Read..:

ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం


సిల్వర్‌జూబ్లీ సంబురాలు..

సిల్వర్‌జూబ్లీ సంబురాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ సమాయత్తమవుతోంది.వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఓ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ వేడుకలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్‌ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణభవన్‌లో సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వరంగల్‌‌‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


మళ్లీ ఉజ్వల భవిష్యత్తు..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల అనంతరం కేటీఆర్‌ అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానం, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్‌ఎస్‌ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా కేటీఆర్ మరోసారి గుర్తుచేయనున్నారు. ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేటీఆర్‌ భరోసా ఇవ్వనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేషన్ కార్డులు కాదు.. పాపులర్ కార్డులు..

విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు

‘మిర్యాల’ ఘటనలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం..

For More AP News and Telugu News

Updated Date - Mar 20 , 2025 | 08:06 AM