KTR : కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం
ABN , Publish Date - Feb 07 , 2025 | 08:26 PM
KTR : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రశంసించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 07: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‍కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఇల్లినాయ్‍లోని ఇవాన్ స్టన్‍లోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19వ తేదీన కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్-2025 జరగనుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించాలని కేటీఆర్‍కు కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ వంటి వినూత్న ఆలోచనలతో తెలంగాణలో సరికొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందిందన్నారు. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని చెనాక్షా గోరంట్ల గుర్తు చేశారు.
ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‍గా హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. అలాగే తెలంగాణ వేదికగా భారత్‍లో పెరిగిన ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ గురించే కాకుండా.. సాంకేతిక రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పుల గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాలోని బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ఈ లేఖలో చెనాక్షా గోరంట్ల తెలిపారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని కేటీఆర్ మెప్పించి ఒప్పించిన తీరు అందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ డిజిటల్ యుగంలో యువతకు హైదరాబాద్‍ను ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దడం అద్భుతమని అభివర్ణించారు. అలాగే ఔత్సాహికులైన యువతీ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కేటీఆర్ వేసిన ప్రణాళికలు సైతం తెలంగాణలో గొప్ప ఫలితాలు సాధించాయని చెప్పారు.
Also Read: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !
పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా కేటీఆర్ గత పదేళ్లలో రాష్ట్రార్థిక ప్రగతికి కూడా బంగారు బాటలు వేశారని అభినందించారు. స్వల్ప కాలంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించడానికి కేటిఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో కీలక పాత్ర పోషించాయని ఈ సందర్భంగా చెనాక్షా గోరంట్ల ప్రశంసించారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్... పాల్గొన్న మన్నవ మోహన కృష్ణ
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా దశాబ్ద కాలంలో రూపొందించిన ప్రణాళికలు, సాధించిన విజయాల తాలూకూ అనుభవాలను విద్యార్థులకు వివరించాలని ఆ లేఖలో కేటీఆర్‍కు విజ్ఞప్తి చేశారు. సుస్థిర అభివృద్ధికి ఎలా.. పునాదులు వేయాలో, పరిపాలనలో సాంకేతికతను జోడించి, మెరుపు వేగంతో ఎలా మెరుగైన ఫలితాలు సాధించాలో తమ యూనివర్సిటీ విద్యార్థులకు సూచనలు చేయాలని కోరారు.. కేవలం తమ విద్యార్థులకే కాకుండా, సదస్సుకు హాజరయ్యే యువ పారిశ్రామికవేత్తల్లో కూడా కేటీఆర్ ప్రసంగం స్ఫూర్తి నింపడం ఖాయమని చెనాక్షా గోరంట్ల ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు
Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్
For Telangana News And Telugu News