Share News

Lavanya Case: లావణ్య, శ్రీనివాస్ ఆడియో కాల్స్ వైరల్..

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:20 PM

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ.. సైబరాబాద్ సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Lavanya Case: లావణ్య, శ్రీనివాస్ ఆడియో కాల్స్  వైరల్..
Audio Calls viral ..

హైదరాబాద్: నార్సింగ్ డిఐ (డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) శ్రీనివాస్‌ (DI Srinivas)ను సైబరాబాద్ సీపీ (Hyderabad CP) ఐజి కార్యాలయానికి అటాచ్ ( IG Office Attached) చేశారు. లావణ్య (Lavanya)తో తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్(Video Calls) మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజి ఆఫీసుకు అటాచ్ చేశారు.. లావణ్య నటుడు రాజ్ తరుణ్‌పై పిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్‌తో ఆమె పరిచయం పెరిగింది. తరచూ ఇద్దరూ ఫోన్లో వీడియో కాల్స్.. ఆడియో కాల్స్ మాట్లాడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సైబరాబాద్ సీపీ శ్రీనివాస్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

రామ్ చరణ్, ఉపాసన ఫుల్ హ్యాపీ..


కాగా రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌.. ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మస్తాన్‌ సాయి అరెస్టు తర్వాత ఆడియో టేపుల లీకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండడంతో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బదిలీ కావడం వీటి ప్రభావమేనని తెలుస్తోంది. మస్తాన్‌ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హర్డ్‌డిస్క్‌లో నగ్న వీడియోలు, ఫొటోలతో పాటు ఆడియో క్లిప్‌లు కూడా ఉన్నట్లు సమాచారం.


ఓ పోలీసు అధికారితో లావణ్యదిగా చెబుతున్న సంభాషణ ఆడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అయింది. ఆడియో సంభాషణ.. ‘రావటం లేదని చెప్పాలా నీకు.. వస్తా అంటే ఏమైతది..ఇప్పుడు నీకు.. వస్తా అంటే ఏం చేస్తరు.. అవన్నీ మీకు ఎందుకు.. నాకు కావాలి’’ అని లావణ్య అంటే ‘రావద్దు అర్థం చేసుకోండి’ అని ఆ పోలీస్‌ అధికారి బదులిచ్చారు. దానికి ఆమె స్పందిస్తూ ‘‘అర్థం చేసుకోను... గలీజ్‌... నేను చాలా గలీజ్‌... నేను ఇప్పుడే వస్తా... మీరు డ్యూటీలో ఉన్నారు. పనిలో ఉండి కలవలేక అవ్వలేదు అంటే పర్వాలేదు.. నో ప్రాబ్లమ్‌.. సరే... అప్పుడు దూరం నుంచి మిమ్మల్ని చూసి వెళ్లిపోతాను. నీ బతుకు నువ్వు చూసుకో... నీది నువ్వు చూసుకో... సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్‌ సరదాగా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేయండ’’ని అడిగింది. దానికి ఆ పోలీసు అధికారి.. ‘నీ గురించి ఇస్తాను.. ఇన్ఫర్మేషన్‌ ఇస్తాను... ఎక్స్‌క్లూజివ్‌ ఇస్తాను’ అని బదులిచ్చాడు. దానికి ఆమె ‘ఎలాగైతే కాప్స్‌తో ఉన్నానో.. మీతో అలాగే ఉంటాను. మనసులోనే ఉంచుకుంటాన’ని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

. ప్యాసింజర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ షాక్

హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు..

ములుగు మన్నెంలో జాతరల సందడి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 12:36 PM