Share News

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:20 PM

LRS : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌కు అనుమతించింది. దీంతో ఎల్ఆర్ఎస్ అధికారిక వెబ్ పోర్టల్‌లోకి వెళ్లిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ లక్షల్లో ఉంటే.. వెబ్ పోర్టల్‌లో మాత్రం వాటి విలువ కోట్లలో చూపిస్తోంది. ఎల్ఆర్ఎస్ ద్వారా నగదు చెల్లించేందుకు గడవు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..
LRS

ఒక బల్బ్, ఫ్యాన్ వాడితేనే.. వేలల్లో కరెంట్ బిల్లులు వచ్చిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చూశాం. అసలు బిజినెస్సే లేని వారికి కోట్లలో ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ నుంచి నోటీసులు రావడమూ చూశాం.. మరి 14 లక్షల విలువైన భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 28 కోట్లు కట్టమనడం ఎప్పుడైనా చూశారా.. అయితే, మీరు ఎల్ఆర్ఎస్ చేయించుకోవాల్సిందే. అవును.. ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వారికి రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. భూమికి రిజిస్ట్రేషన్ లేక ఒక సమస్య అయితే.. ఎల్ఆర్ఎస్‌ పోర్టల్‌లోని తప్పులు వినియోగదారులకు మరో తలనొప్పిగా మారాయి. ఇంతకీ ఏం జరిగింది.. ఎల్ఆర్ఎస్ గురించి జనాలు ఎందుకు భయపడుతున్నారు.. ఎల్ఆర్ఎస్ పోర్టల్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలు ఏంటి.. సవివరంగా..


వేలల్లో విద్యుత్ బిల్లులు, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి తప్పుడు నోటీసులు అంటే.. ఆయా శాఖల్లోని అధికారుల నిర్లక్ష్యమని అంటుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ విషయంలోనూ ఇదే రీతిన జరుగుతోంది. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదలకు కొంత మొత్తంతోనే తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తికి 1300 గజాల స్థలం ఉంది. దాని వీలువ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం అక్షరాల రూ. 14, 52, 000 లక్షలు ఉంది. కానీ, ఎల్ఆర్ఎస్ చేయించుకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళితే.. అక్కడ ఆ బిల్లు, ఈ బిల్లు అంటూ ఏకంగా రూ. 28, 94, 48, 603 కోట్లకు పైగా ఛార్జీలు కట్టాలని చెబుతున్నారు. ఇది చూసి భూమిని యజమాని అవాక్కయ్యారు.


ఇటీవల ఎల్ఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. నోటరీ ల్యాండ్స్ గానీ, లే అవుట్‌లో ఉన్న భూములను రెగ్యులరైజ్ చేసుకొనే ఆవకాశాన్ని ప్రజలకు కల్పించింది. అది కూడా 25 శాతం తగ్గింపు ధరతో ఈ ఎల్ఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చిందీ ప్రభుత్వం. అయితే తెలంగాణలో భూములు మార్కెట్ విలువ రూ.లక్షల్లో ఉంటే.. ఈ ఎల్ఆర్ఎస్‌ వెబ్‌సైట్‌లో మాత్రం వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ. కోట్లలో చూపిస్తుంది. అది కూడా కొన్ని వందల రెట్లలో చూపిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.


దీంతో ఎల్ఎస్ఆర్ వెబ్‌సైట్‌లో అంతా తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతోన్నాయి. ఇక ఈ ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి ప్రభుత్వం 2025, మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే మరో రెండు రోజులు మాత్రమే ఎల్ఆర్ఎస్‌కు ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో ఎల్ఆర్ఎస్ పోర్టల్‌లో తప్పలు రావడం, అది కూడా భారీ మిస్టేక్స్ అవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మార్కెట్ ధర లక్షల్లో ఉంటే.. వెబ్‌సైట్‌లో మాత్రం అడ్డమైన ఛార్జీల పేరుతో కోట్ల రూపాయిలు చూపిస్తుండడంతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గడువు ముగుస్తుండటం.. మరోవైపు ఇలా తప్పుడు అమౌంట్ చూపించడంతో ఏం చేయాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, తప్పులను సరి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Revanth Reddy: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..

CAG Report: అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 27 , 2025 | 04:30 PM