Big Breaking: మీర్‌పేట్ హత్య కేసులో సంచలన ట్విస్ట్...
ABN , Publish Date - Jan 24 , 2025 | 11:13 AM
హైదరాబాద్, మీర్‌పేట్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్‌మెంట్లను తీసుకున్నారు. కాగా గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్: మీర్‌పేట్ హత్య కేసు (Meerpet murder case)లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు (Police) పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి (Key evidence found). శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్ళను పోలీసులు సేకరించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్చిన ఆనవాళ్ళలో డిఎన్ఏ సేకరించారు, దొరికిన డీఎన్‌ఏతో పాటు పిల్లల డీఎన్‌ఏతో పోలీసులు టెస్ట్ చేయనున్నారు. శుక్రవారం మరోసారి గురుమూర్తిని పోలీసులు ప్రశ్నించునున్నారు. కాగా నిందితుడు గురుమూర్తి పిల్లల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం గా ఉన్నాడని గురుమూర్తికి సంబంధించిన విషయాలను పోలీసులకు చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి..
మహేంద్ర షో రూమ్‌లో అగ్నిప్రమాదం
కాగా మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నాడు. అయితే విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని పోలీసులు మరోసారి చెరువు వద్దకు తీసుకువెళ్లారు. ముఖ్యమంగా గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే గురుమూర్తి ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈరోజు సాయంత్రం వరకు పోలీసులు మరికొన్ని కీలక ఆధారాలు సేకరించనున్నారు.
గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్లుగా చెబుతున్న జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల డీవీఆర్‌లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 16 నుంచి మాధవి కదలికలు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంట్లోనే ఆమె హత్య జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. శరీర భాగాలను డ్రైనేజీలో వేశాడేమో అనే అనుమానంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని అన్ని డ్రైనేజీ మ్యాన్ హోళ్లను తెరిపించి పరిశీలించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తిని మీర్‌పేటలోనే పోలీసులు విచారించారు. విషయం బయటకు పొక్కడంతో అతడిని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.. గురువారం రాత్రి వరకు కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి పెదవి విప్పకపోడం గమనార్హం..
ఈ వార్తలు కూడా చదవండి..
అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News