Share News

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:47 AM

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు.

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
Prime Minister Modi

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapalli Railway Terminal) సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రారంభం కానుంది.12:30 నిమిషాలకు వర్చ్యువల్‌ (Virtual)గా ప్రారంభించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ కార్యక్రమంలో వర్చ్యువల్‌గా పాల్గొంటున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార వీక్షణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రులు మంత్రి జి.కిషన్‌ రెడ్డి, వి.సోమన్న, రవనీత్‌ సింగ్‌, బండి సంజయ్‌, గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, తదితరులు హాజరవుతున్న ట్లు అధికారులు తెలిపారు. కాగా, జనవరి 7 నుంచి సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్‌- గుంటూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201-17202), సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.


పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన

అలాగే ప్రధాని మోదీ సోమవారం ఢిల్లీ నుంచి వర్చ్యువల్‌గా పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా జమ్మూ రైల్వే డివిజన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేకు చెందిన రాయగడ రైల్వే డివిజన్‌ భవనానికి శంకుస్థాపన చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్..

ఫార్ములా-ఈ కారు రేసు కేసు.. ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్..

పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 06 , 2025 | 11:50 AM