Vishnupriya Questioned By Police: పోలీసుల విచారణకు విష్ణుప్రియ.. ఏం అడిగారంటే
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:31 PM
Vishnupriya Questioned By Police: యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి విష్ణుప్రియను పోలీసులు విచారించారు.

హైదరాబాద్, మార్చి 20: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియను (Anchor Vishnupriya) మూడు గంటల పాటు పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. విష్ణుప్రియ మొబైల్‌ను పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈరోజు ఆరుమంది విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ కేవలం విష్ణుప్రియ మాత్రమే పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను కూడా రెండు రోజుల క్రితమే విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని, రెండు రోజులు తనకు సమయం ఇవ్వాలని విష్ణుప్రియ పోలీసులను కోరారు.
ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఈరోజు (గురువారం) విష్ణుప్రియ వ్యక్తిగతంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:15 గంటలకు విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరవగా.. దాదాపు మూడు గంటల పాటు విచారించిన పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విష్ణుప్రియతో పాటు ఆమె తరపున న్యాయవాది విచారణకు హాజరయ్యారు. ఇక విచారణలో భాగంగా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ ఒప్పుకున్నారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్‌లకు ఆమె ప్రమోషన్స్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పోలీసులు తీసుకున్నారు.
Pawan Response on Chiru Award: అన్నకు అవార్డుపై.. తమ్ముడి స్పందన
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు సంబంధించి విష్ణుప్రియకు సంబంధించిన పోస్టింగ్‌లను ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే విధంగా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్‌లు పెట్టడం, ఆ యాప్‌ల్లో డబ్బులు పెట్టి సంపాదించవచ్చని డైరెక్ట్‌గా చాలా మందిని బెట్టింగ్ వైపుకు మళ్లించే విధంగా విష్ణుప్రియ పోస్టింగ్‌లు పెట్టారు. వాటిపైనే మూడు గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న విష్ణుప్రియ మొబైల్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజాగుట్ట పోలీసులు ఆదేశించారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారి విచారణలో భాగంగా ముగ్గురు ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం ఇద్దరు మాత్రమే విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. సోషల్‌మీడియాలో బెట్టింగ్ యాప్‌లపై పోస్టులు పెట్టిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా విచారణకు రాగా.. మూడు గంటల పాటు పోలీసులు అతడిని విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
Read Latest Telangana News And Telugu News