Share News

Betting Apps Investigation: రీతూ డుమ్మా.. హైకోర్టుకు విష్ణుప్రియ

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:57 PM

Betting Apps Investigation: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వగా.. ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఇద్దరు కూడా డుమ్మా కొట్టేశారు.

Betting Apps Investigation: రీతూ డుమ్మా.. హైకోర్టుకు విష్ణుప్రియ
Betting Apps Investigation:

హైదరాబాద్, మార్చి 25: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotion) వ్యవహారంలో యూట్యూబర్ రీతూ చౌదరి (YouTuber Rithu Choudhary) పంజాగుట్ట పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఒంటి గంట దాటిన తర్వాత కూడా రీతూ చౌదరి విచారణకు రాలేదు. ఈరోజు (మంగళవారం) విచారణకు రాకపోతే మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnupriya) హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. తనపై నమోదు అయినా ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం విష్ణు ప్రియ విషయంలో పోలీసులు ముందుకెళ్లనున్నారు.


బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారానికి సంబంధించి తమ ఎదుట విచారణకు రావాలంటూ రీతూ చౌదరి, విష్ణుప్రియకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత గురువారం ఇద్దర్నీ కూడా పోలీసులు విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే మరోసారి విచారణకు రావాలని ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలంటూ చెప్పగా... ఇప్పటి వరకు విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు రాలేదు. ఓవైపు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ యాంకర్ విష్ణుప్రియ మాత్రం హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌తో పాటు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని, ఈ రెండింటినీ క్వాష్ చేయాలంటూ హైకోర్టులో యాంకర్ పిటిషన్‌ వేశారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత విష్ణుప్రియ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు విష్ణు ప్రియ విషయంలో ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


అలాగే యూట్యూబర్ రీతూ చౌదరిని కూడా విచారణకు రావాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేయగా.. ఇప్పటి వరకు కూడా ఆమె విచారణకు రాలేదు. గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా రీతూ చౌదరి మూడు గంటలకు హాజరయ్యారు. అయితే ఈరోజు మాత్రం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పినప్పటికీ రీతౌ చౌదరి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా.. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌కు సంబంధించి మొత్తం 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీరిందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. కొంతమంది మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి రాని పరిస్థితి. వారికి టచ్‌లోకి వెళ్ళడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హర్షసాయి, ఇమ్రాన్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. మరికొంత మందికి నోటీసులు ఇచ్చినప్పటికీ వారు ఎవరూ కూడా విచారణకు హాజరుకాలేదు. కేవలం విష్ణుప్రియ, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, కానిస్టేబుల్ కిరణ్‌ గౌడ్ మాత్రమే పోలీసుల విచారణను ఎదుర్కున్నారు. మరోవైపు ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించారు పోలీసులు. ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసిన వీడియోలను పంజాగుట్ట పోలీసులు సేకరించారు. అలాగే బెట్టింగ్ యాప్ యాజమానులపై కూడా పోలీసులు గురిపెట్టారు.


ఇవి కూడా చదవండి...

Supreme Court Comments: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:00 PM