Share News

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

ABN , Publish Date - Mar 21 , 2025 | 09:32 AM

10th class exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Telangana 10th class exams 2025

హైదరాబాద్, మార్చి 21: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (Telangana 10th Exams) మొదలయ్యాయి. విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షల కోసం 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 2,650 మంది శాఖ అధికారులను నియమించారు.


విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 24 గంటలూ పని చేసే కంట్రోల్‌ రూమ్‌లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, విద్యార్థుల విజ్ఞప్తులను 040-23230942 నెంబర్‌కు కాల్ చేసి అడగవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది తొలిసారి 24 పేజీల బుక్‌ లెట్‌‌ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్‌ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు.

CM Revanth Reddy: పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?


కేటీఆర్ ఆల్ ది బెస్ట్

ktr-10th.jpg

మరోవైపు పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా సెంటర్లకు ఆలస్యం కాకుండా ముందుగానే బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. ఎస్ఎస్సీ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు కేటీఆర్.


ఇవి కూడా చదవండి...

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్డ్.. కాసేపట్లో విడుదల..

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 10:26 AM

News Hub