Share News

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:43 PM

Bandi Sanjay Comments On HCU: హెచ్‌సీయూలో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
Bandi Sanjay Comments On HCU

హైదరాబాద్, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (Hyderabad Central University) విద్యార్థుల ఆందోళనపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) స్పందించారు. విద్యార్థులపై చర్యలను ఖండించారు. స్టూడెంట్స్‌పై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. సోమవారం మీడియాతో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భూములకు సంబంధించి మీడియాలో వచ్చిన దృశ్యాలు చూసి తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేడన్నారు. విద్యార్థులను మానవత్వం లేకుండా లాక్కెళ్లడం దారుణమన్నారు. హెచ్‌సీయూలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారన్నారు. అమ్మాయిలను ఈడ్చుకెళ్తున్న వీడియోలు చూస్తే బాధేస్తోందన్నారు. భూములను ఎలా అమ్ముకుంటారని ప్రశ్నిస్తే ఇంతకు తెగిస్తారా అంటూ మండిపడ్డారు.


దొంగల్లా రాత్రి పూట జేసీబీలతో చదును చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారంతో హెచ్‌సీయూకు వెళ్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను అమ్మొద్దంటే విద్యార్థులను అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆ వీడియోలను చూసి ప్రతీఒక్కరూ చలించిపోయారన్నారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌సీయూ భూములకు అమ్మకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని విమర్శించారు. ఈనెల గడవాలంటే హెచ్‌సీయూ భూములను అమ్మాలనే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రాబోయే తరాలకు గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని భూములును అమ్మేస్తారని వ్యాఖ్యలు చేశారు.

Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం


ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌లో వారిని చితకబాదారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అరాచకం అధికమన్నారు. వెంటనే హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌సీయూ భూములను అమ్ముతుంటే విద్యా కమిషన్ చైర్మన్‌లు, మెంబర్‌లు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. వీరంతా కూడా హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని సమర్థిస్తున్నట్లే అని అన్నారు. విద్యార్థుల ఆందోళనలకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలించడం ఏంటి.. కేఏపాల్‌కు రాష్ట్రం ఇచ్చినా భూములమ్మి పాలిస్తారని అన్నారు. భూములమ్మి రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వం ప్రజలకు అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.


ఈటల హెచ్చరిక

etela-rajender.jpg

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి తలమానికమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హెచ్‌సీయూ భూములు అమ్మి అప్పులు కట్టాలని నీచమైన ఆలోచన రేవంత్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. స్మశాన వాటికలకు, పార్కులకు జాగా లేకుండా పోతున్న రోజులివని.. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇలాంటి దుర్మార్గ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. తిరోగమన నిర్ణయాలే తప్ప పురోగతి చర్యలు ఒక్కటి లేవన్నారు. హెచ్‌సీయూ విద్యార్థుల మీద పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ప్రత్యక్ష చర్యలతో రంగంలోకి దిగుతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈటల రాజేందర్ హెచ్చరిక జారీ చేశారు.


ఇవి కూడా చదవండి

Pastor Praveen: విజయవాడలో ఆ 4 గంటలు..

Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 12:46 PM