Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:51 PM
మారిన కాలానికి అనుగుణంగా ఆవు, గేదె పాల ధరల్లో మార్పులు చేయాలని విజయ డెయిరీ భావించింది. ఈ మేరకు ధరలు మార్పు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ పాడి పరిశ్రామాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) సంచలన నిర్ణయం తీసుకుంది. గేదె, ఆవు పాల ధరలను సవరించినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ వేల మంది పాడి రైతుల నుంచి లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ సేకరిస్తోంది. మారిన కాలానికి అనుగుణంగా ధరల్లో మార్పులు చేయాలని భావించింది. దీంతో పాల ధర మార్పునకు సిద్ధం అయ్యింది.
ఈ మేరకు గేదె పాల ధర పెంచగా.. ఆవు పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ వెన్న శాతం 7 ఉన్న గేదె పాలు లీటరుకు రూ.56 చెల్లించగా.. తాజాగా దాన్ని రూ.59.50కి పెంచింది. అలాగే 10 శాతం వెన్న ఉన్న గేదె పాల ధర లీటర్‌కు రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. మరోవైపు 3 శాతం వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటివరకూ రూ.40 ఉండగా.. తాజాగా రూ.36.50కు తగ్గించింది.
ధరల సవరణ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు విజయ డెయిరీ వెల్లడించింది. అయితే ధరల మార్పుతో గేదె పాలు విక్రయించే రైతులకు లబ్ధి చేకూరినప్పటికీ, ఆవు పాలు అమ్మే అన్నదాతలకు మాత్రం కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో ఆవు పాలు విక్రయించే వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. ఇవి తప్పక తెలుసుకోండి..
YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..