Share News

Hyderabad: పండగపూట నిలిచిన నీటి సరఫరా.. ఇబ్బందులు తప్పవా

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:12 PM

Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. లీకేజ్‌ మరమత్తులు చేపట్టామని.. దీంతో తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. దాదాపు 24 గంటల పాటు.. అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం (జనవరి 14) 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు జలమండలి వెల్లడించారు.

Hyderabad: పండగపూట నిలిచిన నీటి సరఫరా.. ఇబ్బందులు తప్పవా
Hyderabad Water Supply

హైదరాబాద్, జనవరి 13: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మంగళవారం) నుంచి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్‌కు తాగు నీటిని సరఫరా చేసే మంజీరా ప్రాజెక్ట్‌ ఫేజ్‌ - 2 లో మరమత్తుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు అధికారులు తెలిపారు. కలబ్‌గూర్‌ నుంచి హైదర్‌నగర్‌ వరకు ఉన్న 1500 ఎంఎం డయామీటర్ పంపింగ్‌ మెయిల్‌లో పలు చోట్ల భారీగా లీకేజ్‌లు ఏర్పడిందని.. దీనివల్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి అధికారులు వెల్లడించారు. లీకేజ్‌ మరమత్తులు చేపట్టామని.. దీంతో తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపారు. దాదాపు 24 గంటల పాటు.. అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం (జనవరి 14) 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో అంతరాయం నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచనలు చేశారు.


నీటి సరఫరా నిలిచే ప్రాంతాలు ఇవే..

ఎర్రగడ్డ

యూసుఫ్‌గూడ

కేపీహెచ్‌బీ కాలనీ

బోరబండ

హైదర్‌నగర్

మూసాపేట్

నిజాంపేట్

మదీనాగూడ

బీరంగూడ

పటాన్చెరు

రామచంద్రపురం

దీప్తి శ్రీనగర్

హఫీజ్‌పేట

మియాపూర్

అమీన్‌పూర్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలు


ఇవి కూడా చదవండి...

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..

ఈ రాశి వారికి షాపింగ్‌, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 12:47 PM