KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:26 PM
KTR: కరీంనగర్‌లో పర్యటనకు వచ్చిన కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్త బైక్ ఢీకొట్టడంతో.. మహిళా కానిస్టేబుల్ పద్మజా కాలు విరిగింది. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.

కరీంనగర్, మార్చి 23: కరీంనగర పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ పద్మజా కాలు విరిగింది. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు వెంటనే వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబాటు చెందిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఉచిత పథకాల పేరుతో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలకు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు.
ఆ క్రమంలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఆ క్రమంలో ఇప్పటికే కేటీఆర్.. సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇక మార్చి 23వ తేదీన కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటిస్తున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావోస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా రజితోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ సభను మార్చి 27వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించడమే కాకుండా.. ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆదివారం బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు కరీంనగర్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్‌లో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. కేటీఆర్ రాక సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను బీఆర్ఎస్ కార్యకర్త వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆమె కాలు విరిగింది.
ఇవి కూడా చదవండి:
IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు
For Telangana News And Telugu News