Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:44 AM
Young Man Killed: పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పుట్టినరోజు నాడే ఓ యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

పెద్దపల్లి జిల్లా, మార్చి 28: జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. పుట్టిన రోజునాడే యువకుడిని దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల సాయికుమార్ గౌడ్ (17) హత్యకు గురయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ జి.కృష్ణ , సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యువకుడి మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
రెండేళ్ల నుంచి తమ కుమారుడు వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారని సాయికుమార్ తండ్రి చెబుతున్నాడు. ఈ కారణంతో తన కుమారుడిని హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సాయి కేక్ కట్ చేస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన అమ్మాయి తండ్రి సాయిపై గొడ్డలితో వేటు వేశాడు. మొదట సాయి మెడపై అమ్మాయి తండ్రి వేటు వేయగా.. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడిని నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తాడు. అయినప్పటికీ అతడిని వదలలేదు.
Traditions: శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..
సాయి కుమార్‌ను కాపాడటానికి స్నేహితులు కూడా వెనకే పరిగెత్తారు. కానీ బొడ్రాయి దగ్గర మళ్లీ వరుసగా సాయిపై గొడ్డలి పోట్లు పడ్డాయి. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాయిని నరికిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నంలోపు నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రేమించిన కారణంగా యువకుడు ఇలా దారుణ హత్యకు గురవడం జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.
ఇవి కూడా చదవండి...
Sandals Viral Video: ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ.. ఎలా తయారు చేశారో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Rice: సన్నబియ్యం వచ్చేశాయ్.. వచ్చే నెల నుంచే రేషన్‌షాపుల్లో పంపిణీ
Read Latest Telangana News And Telugu News