BRS: విద్యపై రాజకీయం దివాలాకోరుతనం: కవిత
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:43 AM
విద్యారంగంపై కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

విద్యారంగంపై కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్ దివాలాకోరుతనానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పేద ప్రజల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చాల్సింది పోయి బీఆర్‌ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మండలిలో విద్యారంగంపై జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి అనుమతులిస్తే అందులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే ఆసిఫాబాద్ తప్ప.. మిగిలిన అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరు విషయంలో వివక్ష తగదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలన్నింటికీ కేటాయించాలని డిమాండ్ చేశారు.