Share News

SLBC tunnel: సొరంగంలో మానవ అవశేషాల గుర్తింపు?

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:46 AM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..! కేరళ నుంచి తీసుకొచ్చిన రెండు క్యాడవర్‌ శునకాలు రెండు చోట్ల మానవ అవశేషాలు గుర్తించినట్లు తెలిసింది.

SLBC tunnel: సొరంగంలో మానవ అవశేషాల గుర్తింపు?

  • 2 చోట్ల క్యాడవర్‌ జాగిలాలు పసిగట్టినట్లు సమాచారం

  • ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 2 వారాలుగా సహాయక చర్యలు

నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట/దోమలపెంట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..! కేరళ నుంచి తీసుకొచ్చిన రెండు క్యాడవర్‌ శునకాలు రెండు చోట్ల మానవ అవశేషాలు గుర్తించినట్లు తెలిసింది. జీపీఆర్‌తో మార్క్‌ చేసిన ప్రాంతంలోనే క్యాడవర్‌ శునకాలు వాసన పసిగట్టినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఇంకా ఏ ప్రకటనా చేయలేదు. శుక్రవారం ఉదయం 7:15 గంటల సమయంలో టన్నెల్‌లోకి వెళ్లిన క్యాడవర్‌ జాగిలాలు 3 గంటల ప్రాంతంలో తిరిగొచ్చాయి. బురద మట్టి ఉండి నీళ్లు ప్రవహించే ప్రాంతంలో 15 అడుగుల కిందనున్న మృతదేహాల వాసనను పసిగట్టే సామర్థ్యం వీటికి ఉంది. అయితే ప్రమాదం సంభవించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో బురద మట్టి, రాళ్లు పేరుకుపోయి కాంక్రీట్‌లా తయారు కావడంతో ఈ జాగిలాలు ఎంతవరకు మానవ అవశేషాలను గుర్తిస్తాయనే అంశంలో సందిగ్ధత నెలకొంది.


సొరంగంలో నీటి ఊట ఆగకపోవడం, సహాయక చర్యల్లో భాగంగా మట్టి తరలింపు ప్రక్రియలో కన్వేయర్‌ బెల్టు మొరాయించడంతో రెస్క్యూ టీమ్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ రోజు వారీ సహాయక చర్యలపై సంబంధింత బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం షిఫ్టులో 14 విభాగాలకు చెందిన 110 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టన్నెల్‌లో బ్యాటరీ సమస్య, రోజ్‌ కట్టర్లు అవసరముందని అన్వి రోబోటిక్‌ హైదరాబాద్‌ బృందానికి సమాచారమివ్వగా.. తక్షణమే వారు స్పందించి లోకో మోటారు ట్రైన్‌లో వాటిని పంపించారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 03:46 AM