Home » Tunnel Collapse
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి జాడను కనుగొనేందుకు సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బుధవారం కన్వేయర్ బెల్టును పునరుద్ధరించడంతో సొరంగం లోపల పేరుకుపోయిన మట్టిని వేగంగా బయటకు తరలించే అవకాశం ఏర్పడింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం తర్వాత.. 23 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. ఇంకా ఏడుగురి మృతదేహాలు లభ్యమవ్వలేదు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకోగా ఇప్పటి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్ జోన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంత మంది అక్కడ ఇరుక్కొని ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆదివారం ఒక మృతదేహాన్ని వెలికితీయగా.. సోమవారం కూడా 12 ఏజెన్సీల ఆధ్వర్యంలో సహాయక బృందాలు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందిలో.. 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెండు వారాలుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..! కేరళ నుంచి తీసుకొచ్చిన రెండు క్యాడవర్ శునకాలు రెండు చోట్ల మానవ అవశేషాలు గుర్తించినట్లు తెలిసింది.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు సర్కారు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందు కోసం కేరళ నుంచి ప్రత్యేక శునకాలను రప్పించింది.
శ్రీశైలం కుడి గట్టు కాలువ సొరంగం (ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్)లో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా పనులు చేపట్టిందని విమర్శించారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎ్‌సఎల్‌బీసీ) టన్నెల్ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులైనా.. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. ఎన్డీఆర్ఎ్ఫ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, సింగరేణికి సంబంధించి దాదాపు 703 మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడం లేదు.