Share News

Kompally: కొంపల్లిలో కాస్‌ గ్రాండ్‌ ఇవొన్‌ వెంచర్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 13 , 2025 | 05:20 AM

కొంపల్లి సినీ ప్లానెట్‌ సమీపంలో కాస్‌ గ్రాండ్‌ ఇవొన్‌ హైదరాబాద్‌ నార్త్‌లో మూడో వెంచర్‌ శనివారం ఘ నంగా ప్రారంభించింది. 2.7 లక్షల చదరపు అడుగు ల రెసిడెంట్స్‌లో వెంచర్‌ లగ్జరీ కమ్యూనిటీని ప్రపం చ స్థాయి సకల సౌకర్యాలతో నిర్మిస్తుంది.

Kompally: కొంపల్లిలో కాస్‌ గ్రాండ్‌ ఇవొన్‌ వెంచర్‌ ప్రారంభం

  • 6.8 ఎకరాల్లో 11 అంతస్తుల్లో 579 ఫ్లాట్ల నిర్మాణం

పేట్‌బషీరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కొంపల్లి సినీ ప్లానెట్‌ సమీపంలో కాస్‌ గ్రాండ్‌ ఇవొన్‌ హైదరాబాద్‌ నార్త్‌లో మూడో వెంచర్‌ శనివారం ఘ నంగా ప్రారంభించింది. 2.7 లక్షల చదరపు అడుగు ల రెసిడెంట్స్‌లో వెంచర్‌ లగ్జరీ కమ్యూనిటీని ప్రపం చ స్థాయి సకల సౌకర్యాలతో నిర్మిస్తుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ వెంచర్‌లో సింగపూర్‌, జపాన్‌కు చెందిన టెక్నాలజీతో 6.8 ఎకరాలలో 11 అంతస్తుల్లో 579 ఫ్లాట్లను నిర్మిస్తామని కాస్‌ గ్రాండ్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఆదిత్య తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ ఫ్లాట్లు బుక్‌ చేసుకున్న వారికి 2027లో అందజేస్తామని తెలిపారు.


హైదరాబాద్‌లో మొదటి ప్రాజెక్టు శంషాబాద్‌లో, రెండోది తుక్కుగూడలో చేపట్టామని, కొంపల్లిది మూడవ ప్రాజెక్టు అని తెలిపారు. ఇందులో క్లబ్‌హౌజ్‌, జపాన్‌ తరహాలో గార్డెనింగ్‌, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. మూడు బెడ్‌రూంలు, నాలుగు బెడ్‌రూంల ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పారు. ఒక్కో ఫ్లాట్‌ను 1.6 కోట్లకు విక్రయిస్తున్నామని, లాంచింగ్‌ రోజు రూ.1.5 కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. టోకెన్‌ అమౌంట్‌గా రూ.2 లక్షలు చెల్లించి ఫ్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు 80 ఫ్లాట్లను వినియోగదారులు బుక్‌ చేసుక్నుట్లు సంస్థ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 09:11 AM