Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
ABN , Publish Date - Apr 02 , 2025 | 08:12 AM
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆదరణ లభిస్తోంది. అంత ఖరీదు పెట్టి కొనలేని సామాన్యులు తమ కార్డలుపై వస్తున్న బియ్యంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పల్లేప్రాంతాల్లోని కొంతమందికి సన్నబియ్యం అంటే తెలియని వారున్నారు. అయితే.. ప్రభుత్వమే ఈ సన్నబియ్యంను అందిస్తుండడంతో వారిలో ఆనందం వక్తమవుతోందని చెప్పవచ్చు.

- రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల బారులు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ శివారు జిల్లాల రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ మొదలైంది. తొలిరోజు కావడంతో మంగళవారం ఉదయం 8 గంటల నుంచే రేషన్‌షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చున్నారు. సన్నబియ్యం కోసం సందెవేళలోనూ బారులు తీరారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో మాత్రం సన్నబియ్యం పంపిణీ జరగలేదు. నగర శివారు ప్రాంతాలైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్ వంటి శివారు పట్టణ ప్రాంతంలోని రేషన్‌షాపుల వద్ద సన్నబియ్యం తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు బారులు తీరారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వాట్సాప్‌లో వచ్చిన లింకును క్లిక్ చేశాడు.. రూ. 14లక్షలు పోగోట్టుకున్నాడు
సందడే సందడి..
రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందని డీలర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని ఓ రేషన్ డీలర్ తెలిపారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ అమలులోకి వస్తుందా? లేదా అనే అనుమానాలు ఉండేవని, ఏప్రిల్ నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఓ మహిళ ఆనందం వ్యక్తం చేసింది.
నాణ్యమైనవి..
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని రేషన్ షాపుల్లో మొదటి రోజు ఇచ్చిన సన్నబియ్యం నాణ్యతను అందరూ పరిశీలించారు. బియ్యాన్ని చూసిన వారంతా బాగున్నాయనే అభిప్రాయానికి వచ్చారు. బియ్యం నాణ్యతపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తూ.. నాణ్యమైన బియ్యాన్ని రేషన్‌షాపులకు సరఫరా చేశామని తెలిపారు.
మూడు రోజులు ఆగాల్సిందే..
సన్నబియ్యం స్టాక్ మంగళవారం రాత్రి వరకే రేషన్‌షాపుల్లో పూర్తయింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్డుదారులు కూడా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని దుకాణాలకు వెళ్లి బియ్యం తెచ్చుకోవడంతో అక్కడి దుకాణాల్లో సన్నబియ్యం నిల్వలు ఖాళీ అయిపోయాయి. ఫలితంగా శివార్లలోని చాలామంది కార్డుదారులకు బియ్యం లభించని పరిస్థితి నెలకొంది. కాగా, మళ్లీ స్టాక్ రావాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ipupuva Laddu: ఇప్పపువ్వు లడ్డూ!
ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
Read Latest Telangana News and National News