Minister: మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:07 AM
ములుగు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)కు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తొలుత కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు.

కారు స్వాధీనం
హైదరాబాద్: ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క(Minister Sitakka) కు సంబంధించిన అసెంబ్లీ కార్ పాస్ స్టిక్కర్ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) స్టిక్కర్ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Liquor: ధరలు పెంచితేనే లక్ష్యాన్ని చేరేది..!
దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్(PRO Pandu Naik) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
BRS: కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటన
Hyderabad: తీగ లాగితే.. డొంకంతా కదిలింది..