Share News

Nalgonda: ‘పరీక్షా పే చర్చ’లో గుర్రంపోడు విద్యార్థిని

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:01 AM

విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని పాల్గొన్నారు.

Nalgonda: ‘పరీక్షా పే చర్చ’లో గుర్రంపోడు విద్యార్థిని

  • ప్రధాని మోదీతో ముచ్చటించిన అంజలి

గుర్రంపోడు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థిని పాల్గొన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె. అంజలి.. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోదీని కలిసి మాట్లాడారు. ఎన్‌సీఈఆర్‌టీ అంజలిని ఢిల్లీకి పంపింది. మండలంలోని ఆమలూరుకు చెందిన కటికర్ల శంకర్‌, పార్వతమ్మ కుమార్తె అంజలి ఆరో తరగతి నుంచి మోడల్‌ స్కూల్‌లో చదువుతోంది. అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ రాగిణి, గైడ్‌ టీచర్‌ సీత అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 04:01 AM