Suryapet: కానిస్టేబుళ్లు చేసిన పనికి ఎస్పీ సీరియస్.. మరీ ఇంత దారుణమా.. బాబోయ్..
ABN , Publish Date - Jan 02 , 2025 | 11:34 AM
తెలంగాణ: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ జాటోత్ రవి, హోమ్ గార్డ్ గంజి శ్రీను బాహాబాహీకి దిగారు. పోలీసులమనే విషయం మరిచి వీధి రౌడీల్లా చొక్కాలు పట్టుకుని దాడి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
సూర్యాపేట: నేరస్థులకు బద్ది చెప్పాల్సిన పోలీసులే దారి తప్పారు. ప్రజలను గాడిలో పెట్టాల్సిన వారే గాడి తప్పారు. లంచాలు తీసుకుని పనులు చేస్తారనే అప్రతిష్ఠ కొంతమంది ప్రభుత్వ అధికారులపై ఎప్పట్నుంచో ఉంది. ఏ పని చేయాలన్నా లంచం ఇస్తే చాలు ఇట్టే పూర్తి చేస్తారనే ఆరోపణలు వస్తుంటాయి. ఎక్కువగా పోలీసు వ్యవస్థలో ఇలాంటి లోపాలు కనిపిస్తుంటాయి. మూమూళ్లు తీసుకుని చూసీ చూడనట్లు వెళ్తారని, ఎవరూ ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సపోర్ట్ చేస్తారనే అపవాదు పోలీసులపై ఉంది. అయితే లంచాలు తీసుకుని ఎప్పుడూ అపనీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కే వీరు.. వాటి పంపకంలో తేడా రావడంతో నేడు పోలీస్ స్టేషన్‌లోనే బాహాబాహీకి దిగారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారులకు చేరడంతో చివరికి సస్పెండ్ అయ్యారు.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ జాటోత్ రవి, హోమ్ గార్డ్ గంజి శ్రీను బాహాబాహీకి దిగారు. పోలీసులమనే విషయం మరిచి వీధి రౌడీల్లా చొక్కాలు పట్టుకుని దాడి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. విచక్షణారహితంగా చేతికందిన వస్తువులతో కొట్టుకున్నారు. తోటి సిబ్బంది వారిని విడిపించే ప్రయత్నం చేసినా.. తగ్గేదే లేదంటూ కొట్టుకున్నారు. ఖైదీలు, పలు కేసుల నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన వారి ముందే ఘర్షణకు దిగడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ సిబ్బంది ద్వారా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌కు చేరింది. దీంతో ఘటనపై ఆయన విచారణ చేపట్టారు.
అయితే రవి, గంజి శ్రీను ఇద్దరూ న్యూఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి వసూలైన మామూళ్ల విషయంలో ఘర్షణకు దిగినట్లు తెలిసింది. యువకులంతా ఉత్సాహంగా ఆడిపాడే డీజేలు సహా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పలు పర్మిషన్లను వీరిద్దరూ ఇచ్చారు. అలా పరిషన్లు ఇచ్చి వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దరి కానిస్టేబుళ్లకు రూ.1500 వసూలు అయ్యాయి. అయితే వీటిని పంచుకోవడంలో రవి, శ్రీనుకు తేడా వచ్చి ఘర్షణకు దిగినట్లు తెలిసింది. దీంతో వారిద్దరిపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు రవి, శ్రీనును సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: తగ్గేదేలే.. చుక్కేసి పోలీసులకు చిక్కిన మద్యంప్రియులు
Medchal: గో రక్షక్ దల్ సభ్యులు దాడి.. ఆస్పత్రి పాలైన డ్రైవర్.. విషయం ఇదే..