Shamsabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీస్ ఔట్ పోస్ట్
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:49 AM
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోనే నూతన పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు.

రంగారెడ్డి అర్బన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోనే నూతన పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలోని ఏరో ప్లాజా వద్ద పోలీస్ ఔట్‌పోస్టును జీఎంఆర్ సీఈవో ప్రదీప్ ఫణికర్, జాయింట్ కమిషనర్ గజ్జరావు భూపాల్, డీసీపీ రాజేశ్‌లతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే తమ బాధ్యత అన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి రోజూ లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, వివిధ రకాల క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక పోలీ్‌సస్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు.