Share News

Kamareddy Car Accident: పెట్రోలింగ్ చేస్తూ ఆగిన కానిస్టేబుళ్లు.. ఇంతలోనే ఊహించని ఘటన

ABN , Publish Date - Mar 20 , 2025 | 09:39 AM

Kamareddy Car Accident: ఇద్దరు కానిస్టేబుల్‌లు అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహించి ఓ చోట రోడ్డు పక్కన నిల్చున్నారు. ఇంతలోనే అనుకోని ఘటన చోటు చేసుకుంది.

Kamareddy Car Accident: పెట్రోలింగ్ చేస్తూ ఆగిన కానిస్టేబుళ్లు.. ఇంతలోనే ఊహించని ఘటన
Kamareddy Car Accident

కామారెడ్డి, మార్చి 20: జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లపైకి (Constables) దూసుకెళ్లింది కారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుళ్లను కారు ఢీకొట్టిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.


జిల్లాలోని గాంధారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ తరువాద వారిద్దరు రోడ్డు పక్కన బైక్‌‌ను ఆపి నిల్చున్నారు. ఇంతలోనే ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. కారు వేగంగా రావడాన్ని చూసిన సుభాష్ అనే వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పక్కకు తప్పుకున్నాడు. కానీ రవి కుమార్ తప్పించుకునేలోపే కారు అతివేగంతో అతడిని ఢీకొట్టేసింది. కారు ఢీకొట్టడంతో బైక్‌తో సహా ఆ కానిస్టేబుల్‌ దూరంగా ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రవికుమార్ స్పాట్‌లోని మృత్యువాతపడ్డాడు. అయితే సుభాష్‌ క్షణాల్లో పారిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

పాండ్యాకు మెంటల్ టార్చర్


అయితే ఈ రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్‌ నిల్చున్న వైపే కారు దూసుకురావడంతో అనుమానాలకు తావిస్తోంది. కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు స్థానికంగా ఉన్న వ్యక్తిదిగా గుర్తించారు. ఆ సమయంలో కారును ఎవరు నడుపుతున్నారు అనేది తేలాల్సి ఉంది. కారులో ఎంత మంది ఉన్నారు.. కారును అంత వేగంగా నడపాల్సిన అవసరం ఏముంది అనే విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవికుమార్, సుభాష్ ఇద్దరు బ్లూకోట్స్‌కు సంబంధించిన పోలీసులు. పెట్రోలింగ్ నిర్వహించడం, గస్తీ నిర్వహించే ప్రత్యేక బృందానికి చెందిన కానిస్టేబుళ్లు. ఈ క్రమంలో పెట్రోలింగ్ నిర్వహించి రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే కేవలం వీరు నిల్చున్న చోటుకే కారు దూసుకురావడం పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..

కేసీఆర్‌ క్యాంపు కార్యాలయానికి టులెట్‌ బోర్డు..


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 12:58 PM