Home » Nizamababad
అవసరాన్ని బట్టి రూ.10 వడ్డీ.. అది కూడా తక్కువ గడువే.. ఆలోగా అసలుతో కలిపి చెల్లించారా సరేసరి..! లేదంటే.. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్నా వేధింపులు తిప్పలు తప్పవు..!
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఆ హామీని నెరవేర్చాలన్నారు.
ఓ కేసులో స్టేషన్ బెయిల్ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేసి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
‘తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించకుంటే నీ భార్య కూతురిని విడిచిపెట్టం.. అందరిలో వివస్త్రలను చేస్తాం’ అంటూ వడ్డీ వ్యాపారులు బెదిరింపులకు దిగడంతో ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లో చేరుతున్నారు మందనం గంగాధర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన మందనం గంగాధర్ డీఎస్పీ విధుల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
కోమాలో ఉన్న వ్యక్తి వైద్యానికి సీఎం సాయం అందించారు. ఖతార్‌లో పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లాడు.
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న తమ భర్తలను అధికారులు కూలీలుగా మార్చి, వేధింపులకు గురి చేస్తున్నారంటూ 17వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు గురువారం సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారులపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
ఆసుపత్రి ఆవరణలో గతరాత్రి బాలుడితో కలిసి తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కి చెందిన వీరు.. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడు పేరు మణికంఠ అని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్‌తోపాటు బస్టాండ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నామని పోలీసులు వివరించారు.