Share News

క్యాబ్‌లు లేక ఎయిర్‌పోర్ట్‌లో స్టాండ్లు వెలవెల

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:49 AM

దీనిపై ఎక్స్‌ వేదికగా జీఎంఆర్‌ యాజమాన్యం స్పందిస్తూ ప్రయాణికులే క్యాబ్‌లు సమకూర్చుకోవాలని వెల్లడించిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మున్ముందు విమానాశ్రయానికి వచ్చే క్యాబ్‌లను పూర్తిగా నిలిపేస్తామని సలావుద్దీన్‌ హెచ్చరించారు.

క్యాబ్‌లు లేక  ఎయిర్‌పోర్ట్‌లో స్టాండ్లు వెలవెల

  • శంషాబాద్‌లో 57 వేల మంది క్యాబ్‌ డ్రైవర్ల ఆందోళన

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కనీస వేతన భద్రత కల్పనతోపాటు కంపెనీ చార్జీల పెంపును నియంత్రించాలని, ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటి కంపెనీల డ్రైవర్లకు న్యాయమైన వేతనం ఇవ్వాలని, తదితర డిమాండ్లతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పది రోజులుగా 57 వేల మంది ఓలా, ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా విమానాశ్రయంలో క్యాబ్‌లు లేక ఓలా, ఉబర్‌ క్యాబ్‌ల స్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అఽఽధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం, జీఎంఆర్‌ విమానాశ్రయ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.


పది రోజులుగా తాము ఎయిర్‌పోర్ట్‌ ట్రిప్‌లను బహిష్కరిస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎక్స్‌ వేదికగా జీఎంఆర్‌ యాజమాన్యం స్పందిస్తూ ప్రయాణికులే క్యాబ్‌లు సమకూర్చుకోవాలని వెల్లడించిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మున్ముందు విమానాశ్రయానికి వచ్చే క్యాబ్‌లను పూర్తిగా నిలిపేస్తామని సలావుద్దీన్‌ హెచ్చరించారు.

Updated Date - Mar 21 , 2025 | 04:49 AM

News Hub