Share News

Water board: నగరంలో.. ఒక క్యాన్‌.. ఒక మొబైల్‌ నంబర్‌ విధానం

ABN , Publish Date - Mar 12 , 2025 | 09:53 AM

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థలో కొత్త విధానానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక క్యాన్‌.. ఒక మొబైల్‌ నంబర్‌ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల నీటిని పొదుపుగా వాడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

Water board: నగరంలో.. ఒక క్యాన్‌.. ఒక మొబైల్‌ నంబర్‌ విధానం

- వాటర్‌బోర్డులో సరికొత్త విధానం

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డు(Waterboard)లో ఒక క్యాన్‌ నంబర్‌కు, ఒక మొబైల్‌ నంబర్‌ విధానాన్ని తీసుకొచ్చారు. గతంలో పలు నల్లా కనెక్షన్ల నంబర్‌ (క్యాన్‌)లకు కలిపి ఒకే మొబైల్‌ నెంబర్‌(Mobile number) అనుసంధానంగా ఉండేవి. ఇప్పుడు ఒక నల్లా కనెక్షన్‌ నంబర్‌కు ఒకే మొబైల్‌ నంబర్‌ విధానాన్ని బోర్డు అందుబాటులోకి తెచ్చింది. అలా ఉంటేనే ట్యాంకర్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించనుంది. గతేడాది నగరంలో అత్యధిక ట్యాంకర్లు బుక్‌ అయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పిల్లలను చంపుకునేంత కష్టం ఏమొచ్చింది..


40మందికి పైగా డ్రైవర్లు తప్పుడు పద్ధతిలో ట్యాంకర్లు బుక్‌ చేసి రెట్టింపు రేట్లకు అమ్ముకున్నారు. ట్యాంకర్‌ బుక్‌ చేసుకోలేని వారి క్యాన్‌ నంబర్లను గుర్తించి, వాటికి డ్రైవర్ల మొబైల్‌ నంబర్లు అనుసంధానం చేసుకుని బ్లాక్‌లో పెద్దఎత్తున ట్యాంకర్లను విక్రయించారు. ఒక్కో క్యాన్‌పై వంద ట్రిప్పులకు పైగా బుక్‌ చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కొత్త తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 09:53 AM