Share News

KTR: రేవంత్‌కు రియల్‌ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు...

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:17 PM

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్‌కు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టదన్నారు. రేవంత్ పతనం అత్తగారి ఊరు నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

KTR: రేవంత్‌కు రియల్‌ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు...
Former minister KTR

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 18: తొందరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక రాబోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ (Former Minister KTR) సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ నేతృత్వంలో రైతు మహాధర్నాలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొండగల్‌కు వలసపోయారంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి అత్తగారి ఊరికి వచ్చినా... వారికి ఏమైనా చేశారా అని చూద్దాం అని వచ్చిన’’ అని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు రారాజుగా ఉండేవాడని తెలిపారు. ఎవ్వరూ అప్పు అడిగే పరిస్థితి లేకుండే అని.. ప్రతీ సీజన్‌లో టింగ్ టింగ్‌మని రైతు బంధు పడేదన్నారు. కానీ.. రేవంత్ టింగ్ టింగ్ అనకుండా టకి టకీ పడతాయి అని అన్నారు కానీ ఎవ్వరికీ పడలేదని విమర్శించారు.


12 కాలాల పాటు 73 వేల కోట్లు రైతుల అకౌంట్‌లలో వేసిన ఘనుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ దొంగ మాటలు.. మోసం మాటలు చెప్పి మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. సోనియాగాంధీ జన్మదినం రోజు వరకు రుణమాఫీ అన్నారని.. రెండు జన్మదిన వేడుకలు అయిపోయాయన్నారు. 35 సార్లు ఢిల్లీ వెళ్లారని..35 పైసలు కూడా తెలంగాణకు తీసుకురాలేదని దుయ్యబట్టారు. రైతుల కుటుంబాలవి.. రేపో మాపో పుస్తెల తాడు బ్యాంక్ వాళ్ళు తీసుకుపోతారన్నారు. రైతుకు కులం మతం ఉండదన్నారు. 70 లక్షల రైతులకు బీఆర్‌ఎస్ రైతు బంధు వేశారని.. 73 వేల కోట్ల రూపాయలు అకౌంట్స్‌లో కేసీఆర్ వేశారని తెలిపారు. ప్రజలు మోసం చేస్తేనే నమ్ముతారని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. ముఖ్యమంత్రి ఇన్ని తిట్లు తినంగా తానెప్పుడూ చూడలేదన్నారు.

సచివాలయ ఉద్యోగాలపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..


బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 430 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పేద పిల్లలు ఉన్నత చదువులు చదవాలని గురుకులాలు పెడితే.. రేవంత్‌కు వాటిని నడపడం చాత కావడం లేదన్నారు. అన్ని వర్గాల వారు ఈ దరిద్రపు పాలనలో విసిగి ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కనుక రైతు భరోసా అని మోసం చేస్తున్నారన్నారు. రేవంత్ ఎకరాకు 17 వేల రూపాయల చొప్పున బాకీ ఉన్నారని.. కానీ ఈసారి మోసపోతే ఇక బాగు చేసే వారు ఉండరన్నారు.


కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే నిలదీయాలని అన్నారు. గతంలో రేవంత్ కుటుంబానికి 500 ఎకరాలు ఉండేవని.. ఇపుడు మరో 1000 ఎకరాలు చేసుకున్నారని వమిర్శించారు. రేవంత్‌కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదన్నారు. రుణమాఫీకి పైసలు లేవని.. పాల రైతులకు పైసలు లేవని కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయని దుయ్యబట్టారు. ఇక్కడ లంకె బిందెలు లేవని రేవంత్ అంటున్నారని.. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ పతనం ఆయన అత్తగారి ఊరైన కల్వకుర్తి నుంచి ప్రారంభంకావాలని కేటీఆర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తప్పిన పెను విమాన ప్రమాదం.. అసలేం జరిగిందంటే..

భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 04:53 PM