Rangareddy: రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
ABN , Publish Date - Mar 02 , 2025 | 10:09 AM
రంగారెడ్డి: నలుగురు సభ్యుల దొంగల ముఠా ఆదివారం తెల్లవారుజామున షిఫ్ట్ కారులో ఆదిభట్ల రావిర్యాల ఎస్‌బీఐ ఎటీఏం వద్దకు చేరుకున్నారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఏటీఎంలోకి ప్రవేశించారు.

రంగారెడ్డి: ఆదిభట్ల రావిర్యాలలో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. రెచ్చిపోయిన దొంగలు ఏటీఎంని బద్దలుకొట్టి రూ.29లక్షలు దోచుకెళ్లారు. నలుగురు సభ్యుల దొంగల ముఠా ఆదివారం తెల్లవారుజామున షిఫ్ట్ కారులో ఆదిభట్ల రావిర్యాల ఎస్‌బీఐ ఎటీఏం వద్దకు చేరుకున్నారు. ఎవ్వరూ లేని సమయం చూసి ఏటీఎంలోకి ప్రవేశించారు. ముసుగులు వేసుకున్న నిందితులు.. దృశ్యాలు రికార్డు కాకుండా ముందుగా సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టారు. అలాగే ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు.
కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను పగలకొట్టారు. నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను పగలకొట్టి డబ్బులు బయటకు తీశారు. అనంతరం కారుల్లో పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, ఆదిభట్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ సమయంలో ఏటీఎంలో రూ.29 లక్షలు ఉన్నట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bolivia Road Accident: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని.. బాబోయ్..
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు ఎంతకు పెరిగాయో తెలుసా..