Share News

Sampath Kumar: ఏది లుచ్చా పని?

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:21 AM

‘‘సీఎంను పట్టుకుని కేటీఆర్‌ లుచ్చా సీఎం అని మాట్లాడుతున్నడు. ఏది లుచ్చా పని? సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం, మెస్‌ చార్జీలు పెంచడమనా?

Sampath Kumar: ఏది లుచ్చా పని?

  • సీఎం గ్యారెంటీలు అమలు చేయడమా?

  • లేక మీరు అవినీతికి పాల్పడడమా?

  • కేటీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎంను పట్టుకుని కేటీఆర్‌ లుచ్చా సీఎం అని మాట్లాడుతున్నడు. ఏది లుచ్చా పని? సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం, మెస్‌ చార్జీలు పెంచడమనా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ రేసు, ధరణిల్లో కేటీఆర్‌ అవినీతికి పాల్పడడం, ఫోన్‌ ట్యాపింగ్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డును అమ్ముకోవడమా? బేరీజు వేసుకుని ఏది లుచ్చాపనో చెప్పాలి’’ అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మా ట్లాడుతూ.. సీఎం రేవంత్‌ కను సైగ చేస్తే కాంగ్రెస్‌ కార్యకర్తల ఆగ్రహానికి కేటీఆర్‌ మసైపోతాడని అన్నారు.


కేటీఆర్‌ ఒళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్‌ చేసిన లుచ్చా పనులతో కేంద్ర, రాష్ట్ర విచారణ సంస్థలు పెట్టిన కేసులు ఆయన మెడకు చుట్టుకున్నాయని, దీంతో పూర్తి అభద్రతాభావంతో మాట్లాడుతున్నాడన్నారన్నారు. బండి సంజ య్‌ మెంటల్‌ కృష్ణ అని, ఆయ న విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Updated Date - Jan 11 , 2025 | 05:21 AM