ORR: ఔటర్‌కు సర్వీసు రోడ్డు.. ఆర్‌ఓబీ నిర్మిస్తున్న రైల్వే అధికారులు
ABN , Publish Date - Mar 15 , 2025 | 10:02 AM
ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఓ సర్వీసు రోడ్డును నిర్మించేంుకు అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. ఈమేరకు పటాన్ చెరు దగ్గర్లోని కొల్లూనే వద్ద ఈ సర్వీసు రోడ్డు నిర్మాణం జరిపేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు.

- ఆర్‌ఓబీ నిర్మిస్తున్న రైల్వే అధికారులు
- ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి హెచ్‌జీసీఎల్ చర్యలు
హైదరాబాద్ సిటీ: ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)కు కొల్లూరు తర్వాత సర్వీసు రోడ్డు లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. కొల్లూరు(Kollur)లోని ఈదులనాగులపల్లి ఇంటర్‌ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ ఉండడంతో కేవలం ఆరు లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రధాన మార్గం మాత్రమే ప్రస్తుతం ఉండగా.. తాజాగా సర్వీసు రోడ్డుకు మార్గం సుగమం చేస్తూ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మోసాలకు కలరింగ్.. నకిలీ యాప్‌లు, స్కీములకు సెలబ్రిటీల ప్రచారం
కొల్లూరు నుంచి పటాన్‌చెరు(Kollur to Patancheru)కు సర్వీస్ రోడ్డు లేకపోవడం, పటాన్‌చెరు నుంచి కొల్లూరు వైపు కొంతదూరమే సర్వీసు రోడ్డు ఉండడం, ఆ తర్వాత లేకపోవడంతో కొద్దిదూరం ప్రయాణానికి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి టోల్ చార్జీలను భరిస్తున్నారు. చార్జీలను భరించినా పటాన్‌చెరు ఇంటర్‌ఛేంజ్ వరకు వెళ్లి తిరిగిరావాల్సిన పరిస్థితులున్నాయి. రైల్వే ట్రాక్‌పై కొల్లూరు వద్ద రైల్వే శాఖ అధికారులు ఇటీవల చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(Railway overbridge) పనులు తుదిదశకు చేరుకున్నాయి.
దీంతో హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అధికారులు కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జికి ర్యాంపులతో సర్వీసు రోడ్డును నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇరు వైపులా నాలుగు లైన్లలో రెండు ర్యాంపులను రూ. 23.56కోట్లతో నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఈదులనాగులపల్లి ఇంటర్‌ఛేంజ్ తర్వాత రైల్వే ట్రాక్ మీదుగా సర్వీసు రోడ్డు రావడం వల్ల ఈ ప్రాంతవాసులకు మెరుగైన రోడ్డు మార్గం ఏర్పడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
Read Latest Telangana News and National News