Smart phone: స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఎంసీహెచ్‌లోకి అనుమతి..
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:06 AM
మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)లోకి స్మార్ట్ ఫోన్ ఉంటేనే అనుమతిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుంటే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. ఇటీవల వరకు ఈ నిబంధన లేనప్పటికీ ఇటీవలే ఈ స్మార్ట్ ఫోన్‌ను తప్పనిసరి చేశారు.

- ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్ చెప్తేనే ఓపీ చీటీ
- గాంధీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో గర్భిణుల అవస్థలు
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) ఓపీ భవనం వెనుక వైపు ఉన్న మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్)లో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంలో ఆరు రోజులు సేవలందిస్తున్న ఎంసీహెచ్ భవన్‌కు వచ్చే గర్భిణులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంసీహెచ్ ఓపీలో వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే స్మార్ట్ ఫోన్(Smart phone) తప్పనిసరి చేశారు. స్మార్ట్ ఫోన్ లేకుంటే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు.
ఈ వార్తను కూడా చదవండి: MLC Kavitha: గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం..
ఓపీ కౌంటర్ బయట అతికించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌ను గర్భిణులు స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయాలి. అనంతరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు(Ayushman Bharat Health Card)పై క్లిక్ చేసి ఫోన్ నంబర్ లేదా హెల్త్ కార్డు నంబర్‌తో పాటు క్యాప్చా ఎంటర్ చేసి నెక్ట్స్ క్లిక్ చేయాలి. అనంతరం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి నెక్ట్స్‌క్లిక్ చేయాలి. అనంతరం డిస్‌ప్లే అయిన కార్డును డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. కార్డుపై ఉన్న నంబర్ ఓపీలో చెప్తే గర్భిణులకు ఓపీ చీటీ ఇస్తారు. ప్రతిరోజూ వివిధ జిల్లాలతో పాటు నగరం నలుమూలల నుంచి దాదాపు 120 మంది గర్భిణులు వైద్య పరీక్షల కోసం ఎంసీహెచ్‌కు వస్తుంటారు.
ఒక్కొక్కరికి హెల్త్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి దాదాపు 20 నిమిషాలు పడుతోంది. చిన్న కీ ప్యాడ్ ఫోన్ తెచ్చుకున్న, ఫోన్‌తేచ్చుకోని గర్భిణులకు ఓపీ చీటీ ఇవ్వడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల నుంచి మధాహ్నం ఒంటి గంట వరకు కేవలం 40 మంది గర్భిణులు మాత్రమే ఆయూష్మాన్ భారత్ కార్డు నంబర్ చెప్పి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రికి వచ్చే గర్భిణులందరికీ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
క్యూఆర్ కోడ్ కోసం ప్రత్యేక కౌంటర్
ఎంసీహెచ్ కేంద్రంలో గర్భిణులకు సాయం అందించేందకు జనహిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు స్నేహ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. గర్భిణులకు స్మార్ట్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్(QR code) ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ప్రతి రోజూ దాదాపు 30 మందికి ఈ కార్డు డౌన్‌లోడ్ చేయిస్తున్నానని ఆమె తెలిపారు. గర్భిణులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే జనహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవలందిస్తున్నామని ఆమె వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News