Share News

Sridhar Babu: సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు హైదరాబాద్‌ అనుకూలం:మంత్రి శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:40 AM

సెమీ కండక్టర్‌ (చిప్‌ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు.

Sridhar Babu: సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు హైదరాబాద్‌ అనుకూలం:మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జనవరి6(ఆంధ్రజ్యోతి): సెమీ కండక్టర్‌ (చిప్‌ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. సోమవారం సచివాలయంలో పీటీడబ్ల్యూ గ్రూప్‌ ఏషియా విభాగం ప్రతినిధులతో మంత్రి సచివాలయంలో మాట్లాడారు. సెమీకండక్టర్‌ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్‌, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్‌లో ఉంది.


అయితే రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసే పక్షంలో ప్రభుత్వ విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి వారికి వివరించారు. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉత్పాదక కేంద్రం మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పీటీడబ్ల్యూ ఏషియా విభాగం ఎండీ టార్‌ స్టెన్‌ సెయ్‌ ఫ్రైడ్‌ చెప్పారు. సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్‌ ట్రానిక్స్‌ ఎండీ విద్యాసాగర్‌ రెడ్డి, సింగపూర్‌కు చెందిన కన్సల్టెంట్‌ సంస్థ ‘టాప్‌2 పిటిఇ’ సీఈఓ రావు పనిదపు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 04:40 AM