SriSailam Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మరో మృతదేహం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:47 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువలో మరో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం జయప్రకాశ్ అసోసియేట్స్ ఇంజనీర్ మనోజ్ కుమార్ (51)కి సంబంధించినదిగా గుర్తించబడింది. 22 రోజులు కిందట జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు

మృతుడు జయప్రకాశ్ అసోసియేట్స్ ఇంజనీర్ మనోజ్ కుమార్‌గా గుర్తింపు
స్వస్థలం యూపీలోని బాంగర్‌నవూ
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
నాగర్‌కర్నూల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో మరో మృతదేహం లభ్యమైంది. మృతుడిని జయప్రకాశ్ అసోసియేట్స్‌కు చెందిన ఇంజనీర్ మనోజ్ కుమార్ (51)గా గుర్తించారు. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బాంగర్‌మవూ గ్రామం. అ తనికి భార్య స్వర్ణలత, కుమారుడు ఆదర్శ్, కుమార్తె శైలజ ఉన్నారు. గతనెల 22న సొరంగంలో కొంత భాగం కుప్పకూలి 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వాజాడ కనుగొనేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, సింగరేణి కార్మికులతో సహా 18 ఏజెన్సీలకు చెందిన సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఒకరి మృతదేహం లభ్యమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరొకరి మృతదేహాన్ని కనుగొన్నారు. కన్వేయర్ బెల్టుకు 40-50 మీటర్ల దూరంలో లోకోట్రైన్ శిథిలాల కింద మృతదేహం కాలు కనిపించింది. ఎక్స్‌కవేటర్‌తో ఏమాత్రం కదిపినా మృతదేహం ఆనవాళ్లు లేకుండాపోయే ప్రమాదం ఉండడంతో మా న్యువల్‌గా మట్టిని తొలగించారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చేసరికి ఉదయం 10 గంటలు అయింది. ఒంటి పై ఉన్న దుస్తులు, కొన్ని వైద్య పరీక్షల తర్వాత మృతుడిని మనోజ్ కుమార్‌గా గుర్తించారు.
మధ్యా హ్నం 12.40 గంటల స మయంలో అతని మృతదేహాన్ని ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ నుంచి బయటకు తీసుకొచ్చి నాగర్‌కర్నూల్ వైద్యకళాశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి చెక్కు రూపంలో వారికి అందజేశారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో స్వస్థలానికి పంపించారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ