Share News

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా!

ABN , Publish Date - Jan 26 , 2025 | 05:54 AM

మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డికి దేహశుద్ధి చేశారు.

కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా!

  • అహంకారంగా ఉపాధ్యాయుడి సమాధానం.. సస్పెన్షన్‌

బల్మూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకల కోసం కొందరు విద్యార్థులకు నృత్యం నేర్పుతుండగా.. అటుగా నవ్వుకుంటూ వస్తున్న ఇద్దరు విద్యార్థినులు తనను చూసే నవ్వుతున్నారని భావించిన ఓ ఉపాధ్యాయుడు వారిపైకి చెప్పు విసరడమే కాకుండా విపరీతంగా కొట్టాడు. మరుసటి రోజు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి అదేమిటని అతణ్ని ప్రశ్నించగా ‘కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా’ అంటూ అహంకారంగా సమాధానం చెప్పడంతో వారు ఆగ్రహించి ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డికి దేహశుద్ధి చేశారు.


ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఈ ఘటనపై వివరణ కోరగా గతంలోనే ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, తమ సిబ్బందితో కలిసి ఉపాధ్యాయుడికి పలుమార్లు సూచనలు చేసినా ఆయన తీరు మారలేదని చెప్పారు. కాగా, ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సరెడ్డిని సస్పెండ్‌ చేసినట్లు డీఈవో తెలిపారు.

Updated Date - Jan 26 , 2025 | 05:54 AM