Teachers Day: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఈ రోజును..
ABN , Publish Date - Jan 03 , 2025 | 10:46 AM
తెలంగాణ: భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మా జ్యోతిబా పూలే ఆయన సతీమణి సావిత్రీబాయి ఫూలే 19వ శతాబ్దంలో మహిళలు, ఆడపిల్లల చదువు కోసం చేసిన విశేష సేవలకు గానూ ప్రతి ఏటా జనవరి 3న వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా టీచర్స్ డే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 50 శాతానికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు. ఈ మేరకు ఆ రోజున మహిళా ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ వారికి సన్మానాలు సహా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అన్ని పాఠశాలకు ఆదేశాలిచ్చారు.
TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..
సామాజిక అసమానతలు, లింగ వివక్ష వంటి అనేక సామాజిక రుగ్మతలపై సావిత్రీబాయి పూలే అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. విద్య, కుల వివక్ష వంటి సమస్యలపై ఆమె చేసిన పోరాటం.. దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చెప్పారు. జనవరి 3న సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. పూలే దంపతుల ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు చదువుకోవాలని, అణచివేతకు గురైన కులాలకు న్యాయం జరగాలని ఆ దంపతులిద్దరూ తమ జీవితాలను పణంగా పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకే ప్రతి ఏటా జనవరి 3న తెలంగాణలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ED: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అధికారులకు మళ్లీ ఈడీ పిలుపు
Hyderabad: సంక్రాంతికి ముందే హైదరాబాదీలకు మరో పండగ.. నేటి నుంచి ప్రారంభం..