Share News

తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:55 AM

తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది.

తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌

  • జీఎ్‌సడీపీలో దేశంలోనే ఏడో స్థానం.. గతేడాదికంటే 14.5ు వృద్ధి రేటు

  • జీడీపీలో రాష్ట్ర వాటా 5.1 శాతం.. ‘తెలంగాణ గణాంకాల సంగ్రహం-2024’లో వెల్లడి

  • ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. సిక్కిం, ఢిల్లీ, గోవా, ఛండీగఢ్‌ వంటి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ, తెలంగాణ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ(టీజీడీపీఎస్‌)... అధికారిక వినియోగం కోసం 2024 సంవత్సరానికిగాను ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంగ్రహం(అట్లా్‌స)’ను రూపొందించాయి. ఈ అట్లా్‌సను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఆవిష్కరించారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,84,205గా ఉందని, దానికంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,72,359 ఎక్కువని వివరించింది. తెలంగాణ తలసరి ఆదాయం 2022-23 నుంచి 2023-24 మధ్య కాలంలో 14.1 శాతం పెరిగిందని, దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ అధిగమించిందని తెలిపింది.


ఇక రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎ్‌సడీపీ) వృద్ధి రేటు విషయంలో తెలంగాణ దేశంలోనే ఏడో రాష్ట్రంగా నిలిచిందని ప్రభుత్వం వెల్లడించింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి తెలంగాణ 5.1 శాతం వాటాను అందిస్తుందని వివరించింది. 2023-24 సంవత్సరానికిగాను జీఎ్‌సడీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.15,01,981 కోట్లుగా ఉందని అట్లాస్‌ వివరించింది. రాష్ట్ర జీఎ్‌సడీపీ 14.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల జీఎ్‌సడీపీలతో పోలిస్తే రాష్ట్ర జీఎ్‌సడీపీపరంగా తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలుస్తోందని వివరించింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. 2022-23లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.13,11,823 కోట్లు ఉండగా.. 2023-24 సంవత్సరంలో 14.5 శాతం పెరిగి రూ.15,01,981 కోట్లకు చేరింది. 2022-23లో 14.2 శాతంగా ఉన్న జీడీపీ 2023-24లో 9.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో తెలంగాణ జీఎ్‌సడీపీ సగటు వృద్ధి రేటు 12.9 శాతంగా ఉంటే... జాతీయ జీడీపీ సగటు వృద్ధి రేటు 10.3 శాతంగా ఉందని వివరించింది.

Updated Date - Feb 18 , 2025 | 03:55 AM