Share News

త్రినాథరావుకు మహిళా కమిషన్‌ నోటీసులు

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:55 AM

నటి అన్షూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మజాకా సినిమా టీజర్‌ లాంచ్‌ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తామని కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ నేరేళ్ల శారద తెలిపారు.

త్రినాథరావుకు మహిళా కమిషన్‌ నోటీసులు

  • పెద్ద మనసుతో క్షమించండి: త్రినాథరావు

నటి అన్షూపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మజాకా సినిమా టీజర్‌ లాంచ్‌ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేస్తామని కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ నేరేళ్ల శారద తెలిపారు. మరోవైపు, దర్శకుడు త్రినాథరావు అన్షూపై చేసిన వ్యాఖ్యలకు గాను.. ఆమెకు, మహిళలకు క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు చాలా మంది మహిళల మనసులు నొప్పించాయని అర్థమైంది.


ఇవి మీ అందర్నీ నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలే తప్ప.. కావాలని చేసినవి కావు. ఏదో వినోదం కోసం చేసిన ప్రయత్నమిది. అది కూడా కావాలని చేసింది కాదు. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. నా వల్ల ఎవరెవరి మనోభావాలు దెబ్బతిన్నాయో.. వారందరికీ మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని క్షమించండి’’ అని వీడియోలో పేర్కొన్నారు.

- సినిమా డెస్క్‌

Updated Date - Jan 14 , 2025 | 03:55 AM