Share News

Security Bureau: వసతి కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేస్తున్నారా..?

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:24 AM

మహాకుంభమేళాకు వెళ్లే తెలంగాణ భక్తులకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు సూచనలు చేశారు. కొన్ని కోట్ల మంది పాల్గొనే ఇలాంటి ఉత్సవాల్లో సైబర్‌ నేరగాళ్లు పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Security Bureau: వసతి కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేస్తున్నారా..?

  • మహాకుంభమేళాకు వెళ్లే తెలంగాణ భక్తులు భద్రంగా ఉండాలంటూ సైబర్‌ అధికారుల సూచన

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మహాకుంభమేళాకు వెళ్లే తెలంగాణ భక్తులకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పలు సూచనలు చేశారు. కొన్ని కోట్ల మంది పాల్గొనే ఇలాంటి ఉత్సవాల్లో సైబర్‌ నేరగాళ్లు పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, లింకులను రూపొందించి నెట్‌లో పెడతారని, ఎక్కువ డిస్కౌంట్లను ఆశ చూపి అడ్వాన్స్‌ నగదు తీసుకున్న తర్వాత మళ్లీ ఫోన్లు ఎత్తరని అన్నారు. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వసతికి సంబంధించి ‘ధర్మశాల’ పేరిట నకిలీ లింకులను ఇంటర్నెట్‌లో పెట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే వసతి కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. మహాకుంభ మేళాకు వెళ్తున్న భక్తులు ఆన్‌లైన్‌లో వసతి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో అనుమానాస్పదంగా ఎదుటి వారి ప్రవర్తన కనిపిస్తే, వెంటనే లావాదేవీని నిలిపివేసి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నెంబరు 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ కోరారు.

Updated Date - Jan 12 , 2025 | 05:24 AM