Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:06 AM
ప్రయాణం, పర్యాటకం, దేవుడి దర్శనం.. వంటి ఏ టికెట్ అయినా ఇకపై సులభంగా పొందవచ్చు.
ప్రయాణం.. పర్యాటకం.. దర్శనం..
ఒకచోటే టికెట్ బుకింగ్. . టీజీఈఎస్డీ రూపకల్పన
హైదరాబాద్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రయాణం, పర్యాటకం, దేవుడి దర్శనం.. వంటి ఏ టికెట్ అయినా ఇకపై సులభంగా పొందవచ్చు. అందుకోసం తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలకా్ట్రనిక్స్ సర్వీసెస్ డెలివరీ(టీజీఈఎస్డీ) ‘మీ టికెట్’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ సాయంతో పౌర ేసవలను ప్రజల ముంగిటకు చేరవేస్తున్నామని చెప్పారు.
అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే వేదిక(ప్లాట్ ఫాం)పైకి తెచ్చేందుకు వీలుగా మీ టికెట్ యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఇందులో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, ఆర్టీసీ, మెట్రో, జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు బుక్ చేసుకోవచ్చని శ్రీధర్ బాబు చెప్పారు. ఈ యాప్‌లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు. రాబోయే రోజుల్లో ఈ తరహా యాప్‌లు మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.