Share News

Ambulance: ప్రభుత్వ అంబులెన్స్‌లు మన వద్ద మరీ తక్కువ!

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:55 AM

సర్కారీ అంబులెన్స్‌ సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 20వ స్థానంలో నిలిచింది. ఈ విషయం లో పొరుగున ఉన్న ఏపీతోపాటు ఝార్ఖండ్‌, ఒడిసా, బిహార్‌ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకంజలో ఉండడం గమనార్హం.

Ambulance: ప్రభుత్వ అంబులెన్స్‌లు మన వద్ద మరీ తక్కువ!

  • దేశంలోనే 20వ స్థానంలో తెలంగాణ

  • అందుబాటులో 456 వాహనాలు మాత్రమే

  • 7,499 అంబులెన్స్‌లతో మహారాష్ట్ర

  • ఫస్ట్‌ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సర్కారీ అంబులెన్స్‌ సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 20వ స్థానంలో నిలిచింది. ఈ విషయం లో పొరుగున ఉన్న ఏపీతోపాటు ఝార్ఖండ్‌, ఒడిసా, బిహార్‌ రాష్ట్రాల కంటే తెలంగాణ వెనుకంజలో ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడిచే అంబులెన్స్‌ వాహనాల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 40,445 ప్రభు త్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో 7,499 అంబులెన్స్‌లతో మహారాష్ట్ర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ 4,720, పశ్చిమ బెంగాల్‌ 3,185 వాహనాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, 456 ప్రభుత్వ అంబులెన్స్‌లు కలిగిన తెలంగాణ ఈ జాబితాలో 20వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో 768 ప్రభుత్వ అంబులెన్స్‌లతో తెలంగాణ కంటే మెరుగ్గా ఏపీ 16వ స్థానంలో నిలిచింది. ఇక, దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే ప్రభుత్వ అంబులెన్స్‌ల సంఖ్యలో తెలంగాణ అట్టడుగు స్థానంలో ఉంది. తమిళనాడులో 2,303 ప్రభుత్వ అంబులెన్స్‌లో ఉండగా కర్ణాటకలో 2,007, కేరళలో 783, ఆంధ్రప్రదేశ్‌లో 768 ఉన్నాయి.


కాగా, జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిఽధులతో నడిచేవి ఎన్ని ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే వాహనాలెన్ని? అనే వివరాలను కేంద్రం ఈ జాబితాలో వేర్వేరుగా విడుదల చేసింది. అంతేకాక అడ్వాన్డ్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఏఎల్‌ఎస్‌), బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ (బీఎల్‌ఎస్‌) సాధారణ అంబులెన్స్‌ల సంఖ్యను రాష్ట్రాల వారీగా వెల్లడించింది. ఇందులో ఎన్‌హెచ్‌ఎం నిధులతో నడిచేవి ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచేవి ఎన్ని? అనే వివరాలను కూడా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం నిధులతో నడిచే అంబులెన్స్‌లు 28,830 ఉన్నాయి. ఇందులో ఏఎల్‌ఎస్‌ వాహనాలు 3,044 ఉండగా, 15,283 బీఎల్‌ఎస్‌ వాహనాలు, ఇతర అంబులెన్స్‌లు 10,503 ఉన్నాయి. ఇక, రాష్ట్రాల నిధులతో పని చేసే అంబులెన్స్‌లు దేశవ్యాప్తంగా 11,615 ఉం డగా వాటిల్లో 430 ఏఎల్‌ఎస్‌, 2,067 బీఎల్‌ఎస్‌, ఇతర అంబులెన్స్‌లు 9,118 ఉన్నాయి. ఇక తెలంగాణలో నడుస్తోన్న 456 సర్కారీ అంబులెన్స్‌లు ఎన్‌హెచ్‌ఎం నిధులతోనే నడుస్తున్నాయి. ఈ 456లో 425 బీఎల్‌ఎస్‌, 31 ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు ఉన్నాయి.


జనాభాకు తగ్గట్లుగా లేని అంబులెన్స్‌లు

తెలంగాణ జనాభాకు తగిన విధంగా అంబులెన్స్‌లు లేవన్నది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రతీ 83,991 మందికి ఒక సర్కారీ అంబులెన్స్‌ అం దుబాటులో ఉంది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీ్‌సగఢ్‌లో 3 కోట్ల జనాభా ఉంటే అక్కడ 1,163 అంబులెన్స్‌లున్నాయి. అక్కడ ప్రతీ 25,795 మందికి ఒక అంబులెన్స్‌ అందుబాటులో ఉంది. అత్యధిక సర్కారు అంబులెన్స్‌లు ఉన్న రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో ప్రతీ 17,709 మందికి ఓ అంబులెన్స్‌ ఉంది. యూపీలో 4,720 అంబులెన్స్‌లు ఉండగా ప్రతీ 51,694 మందికి ఒక వాహనం అందుబాటులో ఉంది.


ఏమిటీ ఏఎల్‌ఎస్‌, బీఎల్‌ఎస్‌ ?

ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ అంటే అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థ కలిగిన అంబులెన్స్‌ అని అర్థం. తీవ్రమైన అనారోగ్యం, రోడ్డు ప్రమాదాని గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులు ఆస్పత్రిలో చేరే లోపు ప్రాణం కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన తక్షణ వైద్య సాయం అందించేందుకు కావాల్సిన వసతులు, శిక్షణ పొందిన సిబ్బంది ఈ ఏఎల్‌ఎ్‌సలో ఉంటాయి. స్ట్రెచర్‌, పోర్టబుల్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌, మల్టీపారా మానిటర్‌, పల్స్‌ ఆక్సిమీటర్‌, పోర్టబుల్‌ సక్షన్‌, ఇన్‌ఫ్యూజన్‌ పంప్‌లు, నెబ్యులైజర్‌, ఐవీ ప్లూయిడ్స్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌, మరికొన్ని వైద్య పరికరాలు ఏఎల్‌ఎ్‌సల్లో ఉంటాయి. ఇక, బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ అంటే బేసిక్‌ లైఫ్‌ సపోర్టు వ్యవస్థ కలిగిన వాహనాలు. ఈ బీఎల్‌ఎస్‌ వాహనాల్లో సక్షన్‌ యూనిట్‌, మెడికల్‌ బ్యాగ్‌, డీఫిబ్రిలేటర్‌, వెంటిలేటర్‌, ప్రథమ చికిత్స అందించేందుకు కావాల్సిన మందు లు, పరికరాలు ఉంటాయి.

Updated Date - Jan 06 , 2025 | 03:55 AM