JNTU: జేఎన్‌టీయూకు విజయ డెయిరీ పాలు..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:12 AM
జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎప్టీయూ)కి, దాని అనుబంధంగా అన్ని సాంకేతిక విద్యాలయాలకు విజయ తెలంగాణ డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

- టీజీడీడీసీఎఫ్ఎల్ ఎండీ అభ్యర్థనకు వీసీ అంగీకారం
హైదరాబాద్: జేఎన్‌టీయూ క్యాంపస్(JNTU Campus)లోని అన్ని విభాగాలు, అనుబంధ కళాశాలలు, వసతిగృహాలకు విజయ తెలంగాణ డెయిరీ నుంచి పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ ప్రభుత్వం గతేడాది జనవరిలోనే ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా తెలంగాణ డెయిరీ డెవల్‌పమెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి నుంచి అందిన అభ్యర్థనకు జేఎన్‌టీయూ వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి(Vice Chancellor Kishan Kumar Reddy) సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మాట్లాడుకుంటున్న జంటపై దాడి..
వీసీ సూచన మేరకు వర్సిటీలోని అన్ని విభాగాలు, కళాశాలలు, హాస్టళ్లలోనూ విజయడైరీ పాలను, పాల ఉత్పత్తులనే వినియోగించాలని సూచిస్తూ ప్రిన్సిపాల్స్‌కు, డైరెక్టర్లకు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గురువారం సర్క్యులర్ జారీచేశారు.
దశాబ్దాలుగా నాణ్యతకు పేరుగాంచిన తెలంగాణ విజయ డెయిరీ బ్రాండ్ కింద పాలు, పాల ఉత్పత్తులను విశ్వవిద్యాలయం లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల కోసం కూడా తీసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
విజయ తెలంగాణ డెయిరీ ప్రభుత్వ సంస్థ కనుక ఇకపై టెండర్ ప్రక్రియకు వెళ్లకుండా నేరుగా కొనుగోలు చేయడానికి ఇండెంట్/ఆర్డర్ ఇవ్వాలని సూచించారు.
అందించే పదార్థాలివీ..
నాణ్యమైన పాలతో పాటు దూద్ పేడ, మిల్క్‌కేక్, బాసుంతి, ఐస్‌క్రీములు, స్టెరిలైజ్డ్ ఫ్లేవర్డ్ మిల్క్, బట్టర్ మిల్క్, లస్సీ, పెరుగు, నెయ్యి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్
ఈ వార్తలు కూడా చదవండి:
Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
BJP: రాజాసింగ్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు
పంచుకు తింటే.. పట్టు వచ్చినట్లా?
Read Latest Telangana News and National News