Share News

Warangal: పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌కు సంబంధం.. కలకలం రేపుతున్న జక్రియా అరెస్టు..

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:54 PM

వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Warangal: పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌కు సంబంధం.. కలకలం రేపుతున్న జక్రియా అరెస్టు..
Warangal

వరంగల్: వరంగల్‌(Warangal)లో ఉగ్రవాదుల(Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల(Pakistan Terrorists)తో లింకులు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

Suryapet: మనవడిని రెచ్చగొట్టిన నాయనమ్మ.. సూర్యాపేట పరువు హత్య కేసులో ట్విస్ట్


ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడు జక్రియా బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..

జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 04:38 PM